రాఘవన్‌కి జోడీగా...

22 Jul, 2020 03:12 IST|Sakshi

లోక నాయకుడు కమల్‌హాసన్‌కు జోడీగా కీర్తీ సురేష్‌ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వేట్టయాడు విలైయాడు’ (తెలుగులో ‘రాఘవన్‌’ గా విడుదలైంది). 2006లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఓ సందర్భంలో  పేర్కొన్నారు గౌతమ్‌ మీనన్‌. ఇటీవల కమల్‌హాసన్‌కు స్క్రిప్ట్‌ను కూడా వినిపించారట. కమల్‌ కూడా ఓకే అన్నారని సమాచారం. అలాగే కీర్తీ సురేష్‌కు కూడా కథ వినిపించారట. ఈ సీక్వెల్‌లో ఆమెను కథానాయికగా ఎంపిక చేశారని కోలీవుడ్‌ టాక్‌. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు