మరో లేడీ ఓరియెంటెడ్‌ మూవీలో కీర్తి!

10 Jan, 2019 17:00 IST|Sakshi

‘మహానటి’తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు కీర్తి సురేష్‌. ఈ మూవీ తరువాత ఇప్పటివరకు మరే తెలుగు ప్రాజెక్ట్‌ను కీర్తి సురేష్‌ ప్రకంటించలేదు. తమిళ్‌ డబ్బింగ్‌ సినిమాలైన సామి, పందెంకోడి2, సర్కార్‌ సినిమాలతోనే టాలీవుడ్‌ను పలకరించింది. 

అయితే తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్‌ ప్రాజెక్ట్‌ను తెలుగులో చేయనున్నట్లు ప్రకటించారు. మహేష్‌ కోనేరు నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. కళ్యాణీ మాలిక్‌ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంతో నరేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు