రాజమౌళి చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌

15 Nov, 2018 11:21 IST|Sakshi

సినిమా: ఈ మధ్యకాలంలో లక్కు అంటే నటి కీర్తీసురేశ్‌దే అని చెప్పాలి. మహానటి సావిత్రిగా నటించే అవకాశం రావడమే ఈ బ్యూటీకి గొప్ప అదృష్టం. అయితే ఆ పాత్రగా మారడానికి కీర్తీసురేశ్‌ ఎంతో కృషి చేసి సఫలీకృతం అయ్యింది. సావిత్రిగా నటించాలంటే ఈ భామే నటించాలి అన్నంతగా పేరు తెచ్చుకుంది. అందుకే బాలకృష్ట హీరోగా నటిస్తున్న ఎన్‌టీఆర్‌ బయోపిక్‌లో సావిత్రి పాత్ర చేసే అవకాశం ముందు ఈ అమ్మడినే వరించింది. అయితే ఆ అవకాశాన్ని కీర్తీసురేశ్‌ అంగీకరించలేదు. ఇకపోతే కోలీవుడ్‌లో వరుసగా  విక్రమ్, విశాల్, విజయ్‌ వంటి స్టార్స్‌తో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత ఏ ఒక్క చిత్రం అంగీకరించలేదు. రెస్ట్‌ లేకుండా నటించాను కాస్త విరామం తీసుకుంటానని ప్రకటించింది.

అందులో అసలు విషయం దాగి ఉందని ఇప్పుడు తెలుస్తోంది. ఈ జాణకు రాజమౌళి తాజా చిత్రంలో నటించే మరో లక్కీచాన్స్‌ తలుపు తట్టిందన్నదే ఆ రహస్యం.  రాజమౌళి జూనియర్‌ ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అయిన విషయం తెలిసిందే.  ఇందులో ఒక కథానాయకిగా నటి కీర్తీసురేశ్‌ నటించబోతోందన్నది తాజా సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌  29 నుంచి మొదలవనుంది. రెండవ షెడ్యూల్‌లో కీర్తీసురేశ్‌ పాల్గొననున్నట్లు టాక్‌. అప్పటిదాకా ఈ అమ్మడు రెస్ట్‌ తీసుకుంటుంది.  రాజ మౌళి తన చిత్రంలోని హీరో యిన్ల గురించి అధికారపూర్వకంగా వెల్ల్లడించలేదన్నది గమనార్హం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు