నవ్వుల కీర్తి

17 Oct, 2019 01:50 IST|Sakshi
కీర్తీ సురేశ్

‘హైదరాబాద్‌ బ్లూస్, ఇక్బాల్‌’ వంటి సినిమాలను తెరకెక్కించిన హైదరాబాదీ దర్శకుడు నగేష్‌ కుకునూర్‌ స్పోర్ట్స్‌ రామెడీ (రొమాంటిక్‌ కామెడీ) జానర్‌లో  తెలుగులో తొలిసారి ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆది పినిశెట్టి, కీర్తీ సురేశ్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర నిర్మిస్తున్నారు. ఇవాళ కీర్తీ సురేశ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో కీర్తీ లుక్‌ను రిలీజ్‌ చేశారు. మెడలో తాయత్తు, చేతికి మట్టి గాజులతో హాయిగా నవ్వుతూ కీర్తి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహ నిర్మాత: శ్రావ్య వర్మ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు