జీవితం చాలా చిన్నది నన్బా : కీర్తి

22 Jun, 2020 18:26 IST|Sakshi

కోలివుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్‌ మీడియాలో సందేశాలు పోస్ట్‌ చేశారు. రాధిక శరత్‌కుమార్‌, హన్సిక, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, ఏఆర్‌ మురుగదాస్‌, విశాల్‌, వెంకట్‌ ప్రభు, సందీప్‌ కిషన్‌, ఐశ్వర్య రాజేష్‌, పాండిరాజ్‌, ఆది పినిశెట్టి.. ఇలా పలువురు విజయ్‌ శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘మాస్టర్‌’  టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.(చదవండి : పెంగ్విన్ మూవీ రివ్యూ)

అయితే హీరోయిన్‌ కీర్తి సురేష్‌ చాలా స్పెషల్‌గా విజయ్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలియజేశారు. మాస్టర్‌ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరి సాంగ్‌కు ఆమె వయోలిన్‌ ప్లే చేస్తూ విజయ్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘జీవితం చాలా చిన్నది నన్బా..ఎప్పుడూ ఆనందంగా ఉండండి. హ్యాపీ బర్త్‌ డే విజయ్‌ సార్‌. మీ బర్త్‌డే రోజున ఓ చిన్న వీడియో’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కీర్తి అద్భుతంగా వయోలిన్‌ ప్లే చేసిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా భైరవ, సర్కార్‌ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. కీర్తి విషయానికి వస్తే.. ఇటీవల ఆమె నటించిన పెంగ్విన్‌ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదలైంది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు