కీర్తీ... మిస్‌ ఇండియా

27 Aug, 2019 01:12 IST|Sakshi

హెడ్డింగ్‌ చదవగానే కీర్తీ సురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొన్నారేమో అనుకుంటున్నారా? అదేం లేదు.  అసలు సంగతి ఏంటంటే... కీర్తీ సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రానికి ‘మిస్‌ ఇండియా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నరేంద్ర దర్శకత్వంలో ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రనిర్మాత మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ– ‘‘మా చిత్రంలో కథానాయిక ఎదుర్కొన్న సంఘటనను ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదుర్కొనే ఉంటుంది.

మహిళలు సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. ఇటీవల యూరప్‌లో భారీ షెడ్యూల్‌ పూర్తి చేశాం. మిగిలిన చిత్రీకరణను త్వరగా పూర్తి చేసి, అక్టోబర్‌ లేదా నవంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. కీర్తి నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమా రావాలని కోరుకుంటారో అలాంటి సినిమానే ‘మిస్‌ ఇండియా’’ అన్నారు. ‘‘అన్ని భావోద్వేగాలు కలగలిపిన చిత్రమిది. ఈ కథకు కీర్తీ సురేశ్‌గారు మాత్రమే న్యాయం చేయగలరని నేను, మహేశ్‌గారు భావించి ఆమెను కలిశాం. కథ చాలా బాగా నచ్చి ఆమె ఒప్పుకున్నారు. కీర్తి సహకారంతో సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తి చేస్తున్నాం’’ అన్నారు నరేంద్ర.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు