‘బిగ్‌బాస్‌ను బ్యాన్‌ చేయాలి’

30 Jul, 2019 15:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బిగ్‌బాస్ 3 షో నిర్వహించడం చట్ట విరుద్ధమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రసారాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటువం‍టి కార్యక్రమాల ద్వారా యువత చెడు మార్గంలోకి వెళ్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కూడా ధర్నా చేసినట్టు చెప్పారు. బిగ్‌బాస్‌ షోను నిషేధించే వరకు దేశవ్యాప్తంగా నిరసలు చేపడతామని హెచ్చరించారు.

అన్నమయ్య, షిరిడిసాయి లాంటి భక్తిరస సినిమాల్లో నటించిన నాగార్జున ఇలాంటి షో చేయడం ఎంత వరకు సమంజసమని కేతిరెడ్డి ప్రశ్నించారు. సినిమాలను ఎలాగైతే సెన్సార్ చేస్తారో.. అదేవిధంగా బిగ్‌బాస్‌ షోను కూడా సెన్సార్‌ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిగ్‌బాస్ షో ప్రసారమవుతోందని ఆయన ఆరోపించారు. (చదవండి: ‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదు : అషూ

నాగార్జున పేరును మార్చిన బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. అషూ ఎలిమినేటెడ్‌!

బిగ్‌బాస్‌.. వరుణ్‌కు వితికా శత్రువా?

బిగ్‌బాస్‌.. ఎలిమినేట్‌ అయింది ఆమేనా?

బాబా.. ఇది కామెడీ కాదు సీరియస్‌ : నాగ్‌

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’