‘రొమాంటిక్‌’ హీరోయిన్‌

12 Mar, 2019 09:58 IST|Sakshi

ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆకాష్ పూరి, తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా సినిమాతో పూర్తిస్థాయి కథానాయకుడిగా మారాడు. అయితే ఈ రెండు సినిమాలు ఆకాష్‌కు ఆశించిన స్థాయి గుర్తింపు తీసుకురాకపోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోసారి పూరి స్వయంగా నిర్మిస్తూ కథా కథనాలు అందిస్తూ ‘రొమాంటిక్‌’ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాతో అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీసీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాష్‌కు జోడిగా కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. కేతిక శర్మ అనే మోడల్‌ ఆకాష్‌ సరసన హీరోయిన్‌గా నటించనుందని తెలిపారు. సోమవారం గోవాలో ప్రారంభమైన షెడ్యూల్‌లో కేతిక పాల్గొనున్నారని నిర్మాత చార్మీ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు