కేతిరెడ్డి జీవిత సాఫల్యం

28 Sep, 2015 23:55 IST|Sakshi
కేతిరెడ్డి జీవిత సాఫల్యం

సినీ దర్శక -నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గానూ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. నెల్లూరులో 25 కళా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కే తిరెడ్డి మాట్లాడుతూ- ‘‘నెల్లూరులో  పుట్టడం నాకు ఆ  దేవుడిచ్చిన వరం.

తెలుగు భాషాపరిరక్షణ ఉద్యమ నాయకునిగా నెల్లూరు జిల్లా నన్ను నిలబెట్టింది. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తమిళనాడులో పాఠశాల స్థాయిలో తెలుగు భాషా బోధన రద్దుకు నిరసనగా ఉత్తరాల ద్వారా ఉద్యమం చేయనున్నాం. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి