కేటుగాడి ప్యార్ కహానీ!

8 Sep, 2015 00:16 IST|Sakshi
కేటుగాడి ప్యార్ కహానీ!

రోడ్డు మీద కత్తి లాంటి కారు కనబడితే అతనికి మనసు నిలవదు. వెంటనే తస్కరిస్తూంటాడు. మరి అలాంటి దొంగ మనసును ఓ అమ్మాయి దోచేసింది. ఇంకేముంది మనోడు మారిపోయి ఆ అమ్మాయి ప్రేమను ఎలా  గెలుచుకున్నాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కేటుగాడు’. తేజస్, చాందినీ చౌదరి జంటగా కిట్టూ నల్లూరి దర్శకత్వంలో వెంకట్ బాలసాని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.  నిర్మాత మాట్లాడుతూ -‘‘రెండేళ్ల  నుంచి దర్శకుడు నాకు తెలుసు. ఆయన  కథ మీద నమ్మకంతో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాను ’’ అని చెప్పారు.