కన్నడంలోకి ఖైదీ

12 Mar, 2020 05:08 IST|Sakshi
శివరాజ్‌కుమార్‌

తెలుగు–తమిళ భాషల్లో  ఘన విజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించారు. ఈ సినిమా హిందీలో రీమేక్‌ కాబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు. హిందీ రీమేక్‌లో అజయ్‌ దేవగన్‌ నటించనున్నారు. తాజాగా ‘ఖైదీ’ కన్నడంలో రీమేక్‌ కాబోతున్నట్టు తెలిసింది. కార్తీ చేసిన ఖైదీ పాత్రలో కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ నటిస్తారట. నంద కిశోర్‌ దర్శకుడు.

మరిన్ని వార్తలు