మెగా అభిమానుల కోసం మరో వేడుక..?

26 Jan, 2017 12:06 IST|Sakshi
మెగా అభిమానుల కోసం మరో వేడుక..?

ఖైదీ నంబర్ 150 సినిమాతో బిగ్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, తనకు ఇంతటి ఘనవిజయాన్ని అంధించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయనున్నాడు. ఈ సినిమా థ్యాంక్స్ మీట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుందుకు ప్లాన్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా తెరకెక్కిన ఖైదీ నంబర్ 150, సంక్రాంతి కానుకగా రిలీజ్ వందకోట్ల కలెక్షన్లతో సత్తాచాటింది.

ఈ సందర్భంగా చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముందుగా ఈ థ్యాంక్స్ మీట్ను వైజాగ్లో నిర్వహించాలని భావించినా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. జనవరి 28న హైదరాబాద్ వేదికగా భారీ ఈవెంట్ ను నిర్వహించేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా దాదాపు ఇదే డేట్ ఫిక్స్ అన్న టాక్ వినిపిస్తోంది.