‘బిగ్‌బాస్‌ హౌస్‌లో అతను చుక్కలు చూపించాడు’

24 Nov, 2019 16:02 IST|Sakshi

బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడే కాదు.. ఎలిమినేట్‌ అయిన తర్వాత కంటెస్టెంట్‌లు చేసే వ్యాఖ్యలు కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. తాజాగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 నుంచి ఎలిమినేట్‌ అయిన భోజ్‌పురి నటుడు కేసరి లాల్ యాదవ్ కూడా తనకు హౌస్‌లో ఎదురైన అనుభవాలను వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారాయి. గత రెండు వారాలుగా తను హౌస్‌లో టార్చర్‌ అనుభవించానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తోటి హౌస్‌మేట్‌ సిదార్థ్‌ శుక్లా టార్చర్‌ మెషిన్‌లా మారాడని ఆరోపించారు. 

కేసరి లాల్‌ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘ఈ రెండు వారాలు సిదార్థ్‌ తనను చాలా హింసించాడు. చాలా సమస్యలు సృష్టించి.. టార్చర్‌ మెషిన్‌లా మారాడు. అయితే మూడో వారంలో అతను నన్ను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. మా మధ్య మంచి బంధం ఏర్పడింది. అతను తన తప్పును తెలుసుకున్నాడు. నేను హౌస్‌ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో సిదార్థ్‌ చాలా బాధపడ్డాడు. బిగ్‌బాస్‌ హౌస్‌ నా ప్రవర్తనకు సరిపోదు. ఈ హౌస్‌లో మనుషులు దెయ్యాలుగా మారతారు. తోటి హౌస్‌మేట్స్‌ను దూషించడం ద్వారానే తమకు ప్రాముఖ్యత లభిస్తుందని వారు అనుకుంటారు. ఇలాగా ఉండటం నా వల్ల కాదు. నేను ఇతరులను దూషించలేను.. అనవసర గొడవల్లో తల దూర్చలేన’ని తెలిపారు.

కాగా, రెండు వారాల పాటు హౌస్‌లో గడిపిన కేసరి.. ఈ శుక్రవారం ఎలిమినేట్‌ అయ్యారు. అయితే అతనికి ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ.. బిగ్‌బాస్‌ అతన్ని ఎలిమినేట్‌ చేయడంపై పులువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

సినిమా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌