నన్ను నవ్వించాలి

10 Mar, 2020 05:48 IST|Sakshi

‘షేర్‌షా, లక్ష్మీబాంబ్, ఇందూ కీ జవానీ, భూల్‌ భులయ్యా 2’ సినిమాల విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నారు హీరోయిన్‌ కియారా అద్వానీ. ప్రస్తుతానికి తెలుగులో సినిమాలు చేయడంలేదు కానీ హిందీలో బిజీగా ఉన్నారు కియారా. మరి.. పర్సనల్‌ లైఫ్‌ పట్టించుకునే తీరిక దొరుకుతోందా? అని కియారాని అడిగితే.. ‘హో...భేషుగ్గా.. నా పర్సనల్‌ లైఫ్‌కి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. ప్రొఫెషనల్, పర్సనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేసుకుంటున్నాను’’ అన్నారు.

మరి.. కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? అనేవి కూడా అనుకున్నారా? అంటే ‘‘కాబోయే భర్త గురించి కొన్ని అభిప్రాయాలున్నాయి. అతను ఎంతో నమ్మకంగా ఉండాలి. నన్ను నవ్విస్తుండాలి. నా జోక్స్‌కు తను నవ్వాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల తెగువ ఉండాలి. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పగలిగే ధైర్యవంతుడై ఉండాలి. ఇతరులతో చాలా మర్యాదగా మసులుకోవాలి. ముఖ్యంగా నేను పురుషుడిని అనే అహంభావం ఉండకూడదు. అది ఉన్నవారిని నేను అస్సలు ఇష్టపడను’’ అని మనసులోని మాటను బయటపెట్టారు కియారా.  

మరిన్ని వార్తలు