‘రణ్‌వీర్‌సింగ్‌తో తప్పనిసరిగా నటించాలి’

10 May, 2020 08:09 IST|Sakshi

‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘కలంక్‌’, ‘కబీర్‌సింగ్‌’...  సినిమాలతో బాలీవుడ్‌ను ఆకట్టుకుంది  కియారా అద్వానీ. ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’... సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ  చేరువయ్యింది. ‘విధిరాతతో పాటు కష్టాన్ని  కూడా బలంగా నమ్ముతాను’ అంటున్న కియారా ముచ్చట్లు...

 ప్రేమ–ప్రశంస: నా అభిప్రాయం సంగతి ఎలా ఉన్నా, ప్రేక్షకుల్లో కొందరు నా టర్నింగ్‌ పాయింట్‌ ‘లస్ట్‌ స్టోరీస్‌’ అంటారు. మరికొందరు ‘కబీర్‌సింగ్‌’ అంటారు. ‘లస్ట్‌ స్టోరీస్‌’ తరువాత ‘ఈ అమ్మాయి నటించగలదు’ అనుకున్నారు ఫిల్మ్‌మేకర్స్‌. ‘లస్ట్‌ స్టోరీస్‌’ ప్రశంసలను తెచ్చిపెడితే, ‘కబీర్‌సింగ్‌’ ప్రేక్షకుల ప్రేమను పంచింది.

వారితో:  ‘ఈ హీరోతో ఎలాగైనా సరే తప్పనిసరిగా నటించాలి’ అనుకునే హీరో రణ్‌వీర్‌సింగ్‌. దమ్మున్న హీరో. ఇక హీరోయిన్‌లలో ఆలియా భట్, దీపికా పదుకొనేలతో కలిసి నటించాలని ఉంది.

డ్రీమ్‌ప్రాజెక్ట్‌: సంజయ్‌లీలా భన్సాలీ, రణ్‌వీర్‌సింగ్‌లతో కలిసి పనిచేయాలని ఉంది.

మంచిమాట: సల్మాన్‌ఖాన్‌ ఒక మంచి మాట అన్నారు. ‘మాటలు కాదు, మనం చేసే పని మాట్లాడాలి’. దీంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నాకు నచ్చిన మాట ఇది.

అయిదు కంటే ఎక్కువ సార్లు చూసిన సినిమా: ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’

ఇన్‌సెక్యురిటీ: నాకు తెలిసి ప్రతి ఒక్క యాక్టర్‌కి ఇన్‌సెక్యురిటీ ఫీలింగ్‌ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇదీ మంచిదే! ‘భయం’ ‘బాధ్యత’ను నేర్పుతుంది. ‘స్ట్రాంగర్‌’గా, ‘బెటర్‌’గా తయారవ్వడానికి ఉపకరిస్తుంది.

సీక్రెట్‌ డ్రీమ్‌: అమెరికన్‌ షోలు చూడటం అంటే ఇష్టం. ఏదో ఒకరోజు వాటిలో నటించాలని ఉంది.

ఎనర్జీ:  నా గురించి ఎవరైనా మంచి విషయాలు చెప్పినప్పుడు, ప్రోత్సాహకరమైన మెసేజ్‌లు పెట్టినప్పుడు థ్రిల్లై పోతాను. అవి నా ఎనర్జీని రెట్టింపు చేస్తాయి. సంతోషంతో రెక్కలు వస్తాయి.

విమర్శ: విమర్శను సీరియస్‌గా తీసుకోను. అయినప్పటికీ నేను ఇబ్బందిపడేంత విమర్శను ఇప్పటి వరకైతే ఎదుర్కోలేదు.

రెండు పదాల్లో: రెండు పదాల్లో నా వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే... లాయల్, ఫన్‌ లవింగ్‌.

ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌: హృతిక్‌ రోషన్‌. ‘కహో నా... ప్యార్‌ హై’లో హృతిక్‌ను చూసిన తరువాత... అబ్బో... చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది.

ఇష్టం: సముద్రం అంటే ఇష్టం. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. పెయింటింగ్‌ చేయడం ఇష్టం. ఇక ప్రయాణాలు చేయడం చెప్పలేనంత ఇష్టం. స్కూలు రోజుల్లో మాత్రం ఒంటరిగా ఎక్కడికీ పంపించేవారు కాదు.

నచ్చే ప్రదేశం: న్యూయార్క్‌

నచ్చే వ్యక్తి: అందరినీ గౌరవంగా చూసే వ్యక్తి. మనం ఇతరులతో వ్యవహరించే తీరులోనే మన వ్యక్తిత్వం తెలిసిపోతుంది. మనసులో ఏదీ దాచుకోకుండా సూటిగా మాట్లాడే వాళ్లు, నిజాయితీగా ఉండేవాళ్లు, ఇతరుల పట్ల దయగా ఉండేవాళ్లు, స్వయంకృషితో పైకి వచ్చిన వాళ్లు అంటే ఇష్టం. నన్ను నవ్వించే వ్యక్తులు, నేను చెప్పే జోకులను నవ్వే వ్యక్తులు అంటే కూడా ఇష్టం. 

మరిన్ని వార్తలు