మిస్‌ అవుతున్నాం!

2 Dec, 2018 02:46 IST|Sakshi
కియారా, రాజ్‌ మెహతా, దిల్జీత్‌

‘గుడ్‌ న్యూస్‌’ సినిమా లొకేషన్‌ అది. సమయం ఉదయం ఆరు గంటలు. నటుడు దిల్జీత్‌ సింగ్‌ సెట్‌లోకి వచ్చిన వారికి అటెండెన్స్‌ వేస్తుంటే.. హీరోయిన్‌ కియారా అద్వానీ చెక్‌ చేస్తున్నారు. ‘డైరెక్టర్‌ రాజ్‌ మెహతా సార్‌ వచ్చారా?’ అడిగారు దిల్జీత్‌. ‘హో.. అక్కడ ఉన్నారు’ అన్నారు కియారా. ‘కియారా వచ్చిందా?’ ‘హో నువ్వే కదా? (కియారా వైపు చూస్తూ)’ అన్నారు దిల్జీత్‌ (నవ్వుతూ). అక్షయ్‌కుమార్‌ సార్‌ వచ్చారా? ఇంకా లేదే అన్నట్లు అటూ ఇటూ  చూస్తూ... ఇంకా రాలేదనుకుంటా అన్నారు కియారా. ‘నీకు తెలుసా? అక్షయ్‌సార్‌ ఎప్పుడూ ముందే ఉంటారు. అందర్నీ ఉండమని చెబుతారు’ అన్నారు దిల్జీత్‌. 

ఆ వెంటనే ‘అక్షయ్‌ సార్‌ మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం’ అన్నారు కియారా అండ్‌ దిల్జీత్‌. పై సంభాషణ ఉన్న ఫన్నీ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు దిల్జీత్‌సింగ్‌. అక్షయ్‌ కుమార్, కరీనాకపూర్, దిల్జీత్‌ సింగ్, కియారా అద్వానీ ముఖ్య తారలుగా నటిస్తున్న ‘గుడ్‌న్యూస్‌’ సినిమా షూటింగ్‌ ముంబైలో మొదలైంది. ఇందులో సంతానం కోసం తాపత్రయపడే దంపతులుగా అక్షయ్‌ కుమార్, కరీనా కనిపిస్తారు. వీరిద్దరిలానే పంజాబీ భార్యాభర్తలుగా దిల్జీత్‌సింగ్, కియారా అద్వానీ కనిపిస్తారు. ‘‘కల నిజమైనట్లుంది. మంచి ప్రొడక్షన్‌ హౌస్‌ అండ్‌ టీమ్‌తో కలిసి వర్క్‌ చేస్తున్నాను’’ అన్నారు దిల్జీత్‌. ‘‘అక్షయ్‌ సార్‌తో నటించబో తుండటం చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్‌ అక్షయ్‌ సార్‌ను సెట్‌లో మిస్‌ అవుతున్నాం. ఆయన జాయిన్‌ అవ్వడానికి ఇంకా టైమ్‌ ఉంది’’ అన్నారు కియారా అద్వానీ.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు