బాక్సర్‌కు జోడీ

3 Nov, 2019 00:05 IST|Sakshi
కియారా అద్వానీ

గ్లౌజ్‌ ధరించి బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థి మీద పంచులు విసరడానికి వరుణ్‌ తేజ్‌ సిద్ధమవుతున్నారు. మరి లైఫ్‌లో ప్రేమను చూపించడానికి హీరోయిన్‌ కూడా కావాలి కదా. ఆ హీరోయిన్‌ దొరికేసిందని తెలిసింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుంది. వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపిస్తారు. బాక్సర్‌కు జోడీగా కియారా అద్వానీ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా కియారా అద్వానీ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం.  ఈ సినిమాను అల్లు వెంకటేశ్, సిద్ధు  నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు