హాలీవుడ్‌లో దక్షిణాది నటుడు

8 Nov, 2017 12:49 IST|Sakshi

ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుధీప్‌, కన్నడనాట స్టార్‌ హీరోగా దూసుకుపోతున్నాడు. హీరోగా నటిస్తూనే ఇతర భాషల్లో కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ విలక్షణ నటుడ‍్ని మరో అద్భుత అవకాశం వరించింది. ఓ హాలీవుడ్‌ సినిమాలో సుధీప్‌ కీలక పాత్రలో నటించనున్నాడు. ఆస్ట్రేలియన్‌ దర్శకుడు ఎడ్డీ ఆర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న రైసెన్‌ అనే ఆంగ్ల చిత్రంలో సుధీప్‌ నటిస్తున్నాడు. సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ పోస్టర్‌లోనే సుధీప్‌ కనిపించటంతో హాలీవుడ్‌ సినిమాలో తమ అభిమాన నటుడిది కీలక పాత్ర అని ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

ఈ సినిమాలో సుధీప్‌ న్యూయార్క్‌ లో స్థిరపడిన ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమెరికన్‌ స్టార్‌ హీరోయిన్‌ నికోలే స్కాల్మో హీరోయిన్‌ గా నటిస్తోంది. సాండల్‌వుడ్‌లో స్టార్‌ హీరోగా మంచి ఫాలోయింగ్‌ ఉన్న సుధీప్‌ ఈగ సినిమాతో టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం శివరాజ్‌ కుమార్‌ తో కలిసి విలన్‌ అనే సినిమాలో నటిస్తున్న సుధీప్‌, త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న మెగాస్టార్‌ చిరంజీవి సైరా నరసింహారెడ్డి లోనూ కీలకపాత్రలో నటించనున్నాడు.

మరిన్ని వార్తలు