అవుకు రాజు అండీ... అవుకు రాజు

2 Sep, 2018 01:37 IST|Sakshi
సుదీప్‌

ఎవరీ అవుకు రాజు? ఏమా కథ? అంటే.. మరెవరో కాదు.. ఆయన అభినయ చక్రవర్తి. అబ్బా.. అవుకు రాజు ఎవరో తెలియదు.. మళ్లీ అభినయ చక్రవర్తి అని కొత్త ట్విస్ట్‌ ఏంటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. అభినయ చక్రవర్తి అంటే కన్నడ స్టార్, ‘ఈగ’ ఫేమ్‌ సుదీప్‌. అవుకు రాజు కూడా ఆయనే. సుదీప్‌ పుట్టినరోజు నేడు. కన్నడ చిత్ర సీమలో అభిమానులంతా ఆయన్ను ముద్దుగా అభినయ చక్రవర్తి అని పిలుస్తారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘సైరా’లో ఆయన అవుకు రాజు పాత్ర చేస్తున్నారు. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో రామ్‌చరణ్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

. హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో  సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.   సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా  చిత్రంలోని  ఆయన లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. యుద్ధ సన్నివేశానికి సంబంధించినట్లుగా ఉన్న ఈ స్టిల్‌లో అవుకు రాజుతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిటిష్‌ సైన్యం కనిపిస్తోంది కదూ. సో.. అవుకు రాజు బ్రిటిష్‌ వైపు అని అర్థం చేసుకోవచ్చేమో. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానున్న ‘సైరా’ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అమితాబ్‌ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి ముఖ్య తారాగణంగా  ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది స్వరకర్త, రత్నవేలు ఛాయాగ్రాహకుడు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రముఖ నిర్మాత కన్నుమూత

భయపడిపోయిన చంద్రబాబు..! : వర్మ

సాహో సెట్‌లో స్టార్ హీరో

పాక్‌ ప్రధానికి వర్మ దిమ్మతిరిగే కౌంటర్‌

భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భయపడిపోయిన చంద్రబాబు..! : వర్మ

భార్య అనుచిత ప్రవర్తన... చిక్కుల్లో హీరో

మహేశ్‌బాబుకు జీఎస్టీ ‘షాక్‌’ 

రొమాంటిక్‌   ఎన్‌ఆర్‌ఐ

మా ఆనందానికి కారణం అభిమానులే

అంతా మాయ.. సినిమాలు వద్దన్నారు – శ్రీధర్‌రెడ్డి