పిల్లలతో ఇవేం ఆటలు.. నటికి క్లాస్‌

22 Aug, 2019 16:45 IST|Sakshi

‘ఇదేం పెంపకం. పిల్లలతో ఇలాంటి ప్రమాదకరమైన ఆటలా.. ఇది బాధ్యతారాహిత్యం’ అంటూ నెటిజన్లు..  ప్రముఖ హాలీవుడ్‌ టీవీ సెలబ్రెటీ కిమ్‌ కర్దాషియన్‌కు క్లాస్‌ తీసుకుంటున్నారు. తాజాగా కిమ్‌ కర్దాషియన్‌ తన కూతురు షికాగో వెస్ట్‌ పాముతో ఆడుకుంటున్న వీడియోను పోస్టు చేశారు. ఏమాత్రం భయపడకుండా అరుదైన స్నేక్‌తో ఆ చిన్నారి ఆడుకుంటున్న వీడియో వెంటనే వైరల్‌ అయింది. ‘మై బ్రేవ్‌ గర్ల్‌ షికాగో’ అంటూ ఆమె పోస్టు చేసిన ఈ వీడియోకు కామెంట్లు వెల్లువెత్తాయి.  ‘షికాగో చాలా అల్లరి పిల్ల. ఆమె ముఖాన్ని చూడండి. పాము తలను ఎలా చూస్తుందో. ఓ మై గాడ్‌. ఐ లవ్‌ మై బ్రేవ్‌ గర్ల్‌’ అంటూ కిమ్‌ సోదరి ఖ్లోయి కర్దాషియన్‌ ఈ వీడియోపై కామెంట్‌ చేశారు. 

అయితే, తెలిసితెలియని చిన్నారి అయిన షికాగో చేతికి పామునిచ్చి ఆటలు ఆడించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. పిల్లలకు ఏవి విషపూరితమైన పాములో, ఏవి కావో అన్నది తెలియదని, వారితో ఇలాంటి ఆటలు ఆడించడం ప్రమాదకరమని నెటిజన్లు కిమ్‌ తీరుపై మండిపడుతున్నారు. పాములు కూడా ప్రాణమున్న జీవులేనని, వాటిని ఆటవస్తువులుగా పిల్లల చేతికి ఇవ్వడం తప్పని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు