భార్యకు కళ్లుచెదిరే గిఫ్ట్‌ ఇచ్చిన ర్యాపర్‌

8 Nov, 2019 15:18 IST|Sakshi

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అనే నానుడి అమెరికా నటి కిమ్‌ కర్దాషియన్‌కు సరిగ్గా సరిపోతుంది. సోషల్ మీడియా పోస్టులకు గానూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ అందాల తార తన భర్త కోరిక మేరకు ఓ భారీ ఆఫర్‌ తిరస్కరించినప్పటికీ భారీ మొత్తం అందుకోవటమే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ విషయమేమిటంటే.. అమెరికాకు చెందిన కిమ్ నటిగా, సూపర్‌ మోడల్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 151 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న కిమ్‌ చేత తమ బ్రాండ్లకు ప్రచారం చేసేందుకు కంపెనీలు పోటీపడతాయి. అలా ఓ ప్రఖ్యాత షూ కంపెనీ తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసేందేకు భారీ మొత్తం ఆఫర్‌ చేసిందట. అయితే అది తన భర్త, ర్యాపర్‌ కేన్‌ వెస్ట్‌కు ప్రత్యర్థి సంస్థ కావడంతో మోడలింగ్‌ చేయాలా వద్దా అని ఆలోచించిందట.

ఈ క్రమంలో వ్యాపార దృక్పథంతో ముందుకు వెళ్లాలని భావించిన సమయంలో.. ఇలా చేయడం వల్ల తన కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భర్త చెప్పడంతో తన ఆలోచన విరమించుకుందట. దీంతో తన అభ్యర్థనను మన్నించిన భార్యకు కేన్‌ మిలియన్‌ డాలర్ల చెక్కు ఇచ్చి సంతోష పరిచాడట. ఈ విషయం గురించి కిమ్‌ మాట్లాడుతూ... ‘ ఆయన ఎందుకు నో చెప్పారో నాకు తెలుసు. నా క్రేజ్‌ను ఆయన ప్రత్యర్థి కంపెనీ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని నాతో అన్నారు. దీంతో నేను కూడా వెనక్కి తగ్గాను. అయితే మదర్స్‌ డే సందర్భంగా నాకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రత్యర్థి కంపెనీకి మోడలింగ్‌ చేయకుండా తన యీజీ కంపెనీకి అనుకూలంగా ఉన్నందుకు మిలియన్‌ డాలర్ చెక్కు ఇచ్చారు. అందుకు నా ధన్యవాదాలు తెలిపారు. క్రేజ్‌ ఉంటే ఇలా కూడా జరుగుతుంది కదా. ఇదే మీకు చెప్పాలనకున్న క్యూట్‌ స్టోరీ’ అని సరదాగా చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు