‘రేప్ చేసి చంపేస్తారనుకున్నా’

21 Mar, 2017 14:26 IST|Sakshi
‘రేప్ చేసి చంపేస్తారనుకున్నా’

పారిస్ దోపిడీ ఘటన తర్వాత జీవితం పట్ల తన దృక్కోణం మారిందని రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌ వెల్లడించింది. దోపిడీ దొంగలను తనను రేప్ చేసి, చంపేస్తారని భావించానని తెలిపింది. గతేడాది అక్టోబర్‌ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్‌ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయారు. ఈ ఘటన సందర్భంగా తనను ఎదురైన అనుభవాన్ని తన సోదరీమణులతో పంచుకుంది.

‘అదో భయానక అనుభవం. ఆ క్షణంలో దోపిడీ దొంగలు తుపాకీతో నా తలలో కాలుస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. నేను అరవకుండా నోటికి ప్లాస్టర్ వేయడంతో నన్ను రేప్ చేస్తారని అనుకున్నాను. అందుకు మానసికంగా సిద్ధమయ్యాన’ని కర్దాషియన్‌ వెల్లడించింది. దుండగులు ఆమెకు భౌతికంగా ఎటువంటి హాని తలపెట్టలేదు. ఆమెను స్నానాల గదిలో బంధించి ఆభరణాలు ఎత్తుకుపోయారు. ఈ కేసులో జనవరిలో 16 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించాడు.