కోడి రామకృష్ణ ఇకలేరు

23 Feb, 2019 01:23 IST|Sakshi

గుండెనొప్పితో మృతి 

నేడు రాయదుర్గం మహాప్రస్థానంలో అంత్యక్రియలు

శతాధిక చిత్రాల దర్శకుడిగా చిత్రసీమపై ప్రత్యేక ముద్ర 

సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి 

ముఖ్యమంత్రి కేసీఆర్,  వైఎస్‌ జగన్‌ సంతాపం

హైదరాబాద్‌ : శతాధిక చిత్రాల దర్శకుడిగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన కోడి రామకృష్ణ(63) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. ఫిలింనగర్‌లోని నివాసంలో ఉదయం ఆయనకు స్వల్పంగా గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఫిలింనగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్‌ వెంచర్‌–2లోని నివాసానికి చేర్చారు. శనివారం మధ్యాహ్నం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, సినీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కోడి రామకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన దర్శకులు దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినీ జీవితం ప్రారంభించారు. తన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతోనే హిట్‌ కొట్టారు. 100కు పైగా చిత్రాలకు రామకృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. (అప్పట్నుంచి ఈ కట్టు నాకు సెంటిమెంట్‌ అయింది)

ఇది చదవండి : దర్శక దిగ్విజయుడు

మరిన్ని వార్తలు