నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

18 Aug, 2019 07:46 IST|Sakshi

నటి వాణిభోజన్‌ కోలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకుంటోంది. ఊటీకి చెందిన ఈ బ్యూటీ చదువు పూర్తి అయిన తర్వాత చెన్నైలో మకాం పెట్టేసింది. ఎయిర్‌హోస్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాత మోడలింగ్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆపై బుల్లితెర అక్కడినుంచి వెండితెరకు పరిచయం అయిన నటి వాణి భోజన్‌. ఇంత చరిత్ర కలిగిన మూడు పదుల ఈ బ్యూటీ సినిమాల్లో ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది.

ఆదిలోనే తమిళం, తెలుగు భాషల్లో నటించేస్తోంది. ప్రస్తుతం తెలుగులో క్రేజీ నటుడు విజయ్‌దేవరకొండకు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళంలో వైభవ్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. ఎస్‌జీ.ఛార్లెస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో పాటు తెలుగు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో వాణిభోజన్‌ను మరో తమిళ చిత్ర అవకాశం వరించిందన్నది తాజా సమాచారం.

విశేషం ఏమిటంటే ఇది హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రం అట. నవ దర్శకుడు నిరోజన్‌ తెరకెక్కించనున్నారు. ఇందులో 90 ఎంఎల్‌ చిత్రం ఫేమ్‌ బొమ్ము లక్ష్మీ మరో పాత్రను పోషించనుందట. దీన్ని నటుడు అరుణ్‌ పాండియన్‌ తన ఏఅండ్‌పీ గ్రూప్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా నటి వాణిభోజన్‌ ఇటీవల ఒక అవకాశాన్ని చేజార్చుకుని వార్తల్లోకి ఎక్కింది. అయితే మరిన్ని కొత్త చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు ఈ బ్యూటీ చెబుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు