‘సైలెన్స్‌’లో అనుష్క ఉండేది కాదట

9 Dec, 2019 10:01 IST|Sakshi

తమిళసినిమా: సైలెన్స్‌ చిత్ర ప్రచారం మొదలయ్యింది. ఇది ఐదు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం. తెలుగులో నిశ్శబ్దం పేరుతోనూ , తమిళం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో సైలెన్స్‌ పేరుతోనూ రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నటి అనుష్క. దాదాపు రెండేళ్ల తరువాత ఆమె ముఖానికి రంగేసుకుని నటించిన చిత్రం సైలెన్స్‌. మాధవన్, నటి అంజలి. శాలినిపాండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కిస్తున్నారు. దీనికి టీజీ.విశ్వప్రసాద్, రచయిత కోన వెంకట్‌ నిర్మాతలు.

భాగమతి వంటి సంచలన చిత్రం తరువాత నటి అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో సైలెన్స్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటించిందని సమాచారం. అసలు ఆ చిత్రంలో అనుష్క నటించి ఉండేదే కాదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనవెంకట్‌ అన్నారు. చిత్ర ప్రచారంలో ముమ్మరంగా ఉన్న ఈయన ఒక భేటీలో పేర్కొంటూ సైలెన్స్‌ చిత్ర కథను అసలు అనుష్కను దృష్టిలో పెట్టుకుని రాసింది కాదని చెప్పారు. పలువురు నటీమనులను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇదని చెప్పారు. అలా అనుష్కకు కూడా కథను చెప్పినట్లు తెలిపారు. ఆమె ఇందులో నటించడానికి ముందు అంగీకరించలేదని, ఆలోచించి చెబుతానని అన్నారన్నారు. ఆ తరువాత చాలా రోజుల వరకూ అనుష్క నుంచి బదులు రాకపోవడంతో వేరే నటిని నటింపజేయడానికి సంప్రదింపులు జరిపినట్లు  చెప్పారు. అలాంటి సమయంలో అనుష్క నుంచి ఫోన్‌ వచ్చిందని, సైలెన్స్‌ చిత్రంలో తాను నటిస్తాను అని ఆమె చెప్పినట్లు తెలిపారు. ఆమె మరికాస్త ఆలస్యంగా చెప్పి ఉంటే ఈ చిత్రంలో ఉండేదే కాదని అన్నారు. కాగా సైలెన్స్‌ చిత్ర విడుదలకు తేదీ ఖరారు చేశారు. జనవరి 31న చిత్రాన్ని ఏక కాలంలో ఐదు భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి

‘ప్రతిరోజూ పండుగే’ ప్రమోషన్‌లో గొడవ

బాలీవుడ్‌లోనే ఆదరణ!

కమల్‌ పోస్టర్లపై పేడ వేశాను

చిరు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి మృతి

సినిమాల పైరసీ నేపథ్యంలో.. 

కథా బలం ఉన్న సినిమాలు హిట్టే

రెండు జంటలు

మహిళల స్వేచ్ఛ కోసం.. 

కొత్త నిర్మాతలు లేకుంటే మనుగడ లేదు – సి.కల్యాణ్‌ 

భయపెడతా 

సినీ చరిత్రను పరిరక్షించుకోవాలి 

శంకర్‌ తర్వాత మురుగదాస్‌ : రజనీకాంత్‌

ఈ మామకు ఇంకేం కావాలి : వెంకటేష్‌

‘సోనాక్షి సల్మాన్‌ ఖాన్‌ చెంచా!’

రూ.40కే సినిమాను అమ్మేస్తారా అంటూ హీరో ఆవేదన

రెట్టింపైన క్రేజ్‌; రాహుల్‌కు అవార్డు

వర్మకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన కేఏ పాల్‌

వర్మ ఇలా మారిపోయాడేంటి?

బన్నీ అప్‌డేట్‌ వాయిదా.. ఎందుకంటే..

ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్‌

దుమ్ములేపిన బాలయ్య.. రూలర్‌ ట్రైలర్‌ రిలీజ్‌

ఖమ్మంలో ‘వెంకీ మామ’

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!

శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి

అతి నిద్ర అనారోగ్యం

సేఫ్‌ జానర్‌లో వెళ్లాలనుకోను

తెలుగు సినిమాల్లో రీకన్‌స్ట్రక్షన్‌ను చూద్దామా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైలెన్స్‌’లో అనుష్క ఉండేది కాదట

క్యాన్సర్‌తో హీరో సోదరి మృతి

‘ప్రతిరోజూ పండుగే’ ప్రమోషన్‌లో గొడవ

బాలీవుడ్‌లోనే ఆదరణ!

కమల్‌ పోస్టర్లపై పేడ వేశాను

చిరు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడి మృతి