కొణిదెల ప్రొడక్షన్స్‌.. ‘మెగా చలివేంద్రం’

2 Jun, 2019 20:33 IST|Sakshi

హైదరాబాద్‌: గత ఐదు సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ వద్ద కొణిదెల ప్రొడక్షన్స్‌ తరఫున ‘మెగాచలివేంద్రం’ నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ ఏడాది కూడా మండుతున్న ఎండల నుంచి ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దేశంతో మోడల్‌ ‘మెగా చలివేంద్రాన్ని’ ఏర్పాటు చేశారు. అయితే దీని ఏర్పాట్లు, నిర్వహణపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు చల్లని, పరిశుభ్రమైన నీరు అందించాలని, అంతా హైజెనిక్‌ మెయిన్‌టైన్‌ చేయ్యాలని మెగాస్టార్‌ ఆదేశించారని వారు పేర్కొన్నారు. 

‘ఈ మెగా చలివేంద్రం ప్రతిరోజు మూడు వేల మందికిపైగా ప్రజల దాహార్థిని తీరుస్తుంది. మోడల్‌ చలివేంద్రాన్ని ఖరీదైన సెట్‌తో అత్యంత శుభ్రంగా ఉంచుతాం. ఇక్కడ నిత్యం నలుగురు సిబ్బంది నీరందించడానికి అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు ఈ చలివేంద్రం వద్ద అనేక వాహనాలతో పాటు, సిటీబస్సులు, ఆటోలు, బైక్‌లు, పాదాచారులు ఆగి నీరు తాగి వెళుతుంటారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చలివేంద్రం ప్రజలకు అందుబాటలో ఉంటుంది.  ఇప్పటివరకు ఈ చలివేంద్రంలో సుమారు 1,41,000 మంది తమ దాహార్థి తీర్చుకున్నట్లు’ మెగా చలివేంద్రం సిబ్బంది తెలిపారు. 

మరిన్ని వార్తలు