కొత్త కుర్రోడు వస్తున్నాడు

9 Nov, 2018 02:12 IST|Sakshi
శ్రీరామ్, శ్రీప్రియ

శ్రీరామ్, శ్రీప్రియ జంటగా రాజా నాయుడు. ఎన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కుర్రోడు’. లైట్‌ ఆఫ్‌ లవ్‌ క్రియేషన్స్‌ పతాకంపై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్‌) నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. లచ్చన్న దొర మాట్లాడుతూ– ‘‘రాజా నాయుడుగారు సినిమాను అనుకున్న ప్రణాళిక ప్రకారం చక్కగా తీశారు. సినిమా బాగా వచ్చింది. సాయి ఎలెందర్‌ సంగీతం అందించిన మా సినిమా పాటలు ఆకట్టుకుంటున్నాయి.

త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే సినిమాను అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. ఎన్నో అడ్డంకులు వచ్చినా లక్ష్మణ్‌గారు మాకు అండగా నిలబడి సినిమా పూర్తి చేయించారు. మా అమ్మాయి శ్రీప్రియను ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నా’’ అన్నారు రాజా నాయుడు. శ్రీరామ్, శ్రీప్రియ మాట్లాడారు. ఈ చిత్రానికి నిర్వహణ: అబ్బూరి నాగేంద్ర చౌదరి, కెమెరా: సతీశ్‌ ముదిరాజ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు