సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రేమకథ

21 Dec, 2018 06:23 IST|Sakshi
ప్రియాంత్‌

‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం రమణ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’. ఈ సినిమాతో ప్రియాంత్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. యామినీ భాస్కర్‌ కథానాయిక. నిశ్చయ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. రమణ మాట్లాడుతూ– ‘‘నెలకు 2లక్షల జీతం తీసుకుంటూ పదిమందికీ సాయపడుతూ ఓపెన్‌ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రేమకథ ఇది. అందరికీ సాయపడే తత్వం ఉన్నా ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అతనికి అంతగా నమ్మకం ఉండదు. అలాంటివాడు మన సంప్రదాయం గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఎలా మారాడు? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ప్రియాంత్‌కి తొలి సినిమానే అయినా చక్కగా నటించాడు. త్వరలో ఆడియో రిలీజ్‌ చేయనున్నాం. నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా