‘బాపిరాజు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు’

19 Mar, 2020 16:51 IST|Sakshi
విలేకరుల సమావేశంలో కొట్టు సత్యనారాయణ

సాక్షి, అమరావతి : ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తనకు ప్రాణ భయం ఉందని కేంద్రానికి లేఖ రాశారంటే తప్పు చేసినట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్‌ కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొంతమంది ప్రోద్బలంతో ఈసీ కరోనా వైరస్ కారణం చూపించి ఎన్నికలు వాయిదా వేసినా.. సుప్రీంకోర్టు న్యాయబద్దంగా ఎన్నికల కోడ్ ఎత్తివేయడం హర్షణీయమన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా మాజీ జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రికి  ఏ సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేఖత లేదని స్పష్టం చేశారు. (సీఎం జగన్‌ అత్యున్నత స్థాయి సమావేశం )

గడిచిన ప్రభుత్వం హాయాంలో ఒక్క ఎస్టీ వర్గానికి చెందిన మంత్రిని కాని, మైనారిటీ వర్గానికి చెందిన మంత్రిని చేయకుండా ఉన్న పార్టీ తెలుగుదేశం కాదా అని ప్రశ్నించారు. మద్యం సిండికేటు ద్వారా ముళ్ళపూడి బాపిరాజు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. గ్రామాలను సర్వనాశనం చేశారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పేరుతో ఏర్పాటు చేసి కోట్లాది రూపాయిలు దోచేశారని మండిపడ్డారు. టీడీపికి దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్క గ్రామంలో అయినా అండర్ గ్రౌండ్ పని చేస్తుందో లేదో చూపించగలరా అని సవాల్‌ విసిరారు. సంక్షేమ పథకాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొందరికి మింగుడు పడటం లేదని దుయ్యబట్టారు. ‘నిమ్మగడ్డకు ఈసీగా కొనసాగే అర్హత లేదు’

‘బాపిరాజు గతంలో పోటీ చేసిన మండలంలోనే మరోసారి ఓసీ రిజర్వు అయ్యింది. ఆయన పోటీ చేయాల్సింది. మీ బలమెంతో తెలిసేది కదా. మరెందుకు నామినేషన్ వెయ్యలేదు? ఉగాది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించడం, అవగాహనా ద్వారా వైరస్ భారిన పడకుండా ఉండవచ్చు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మున్సిపాలిటీ పరిధిలో పరిసర ప్రాంతలు పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపాలిటీ అధికారులు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు పూర్తిగా సహకరించాలి’ అని కొట్టు సత్యానారాయణ పేర్కొన్నారు. (‘రౌడీయిజం చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే ఇంతే’)

మరిన్ని వార్తలు