ఆటకి డేట్‌ ఫిక్స్‌

2 Aug, 2019 00:29 IST|Sakshi
ఐశ్వర్యా రాజేష్‌

ఐశ్వర్యా రాజేష్, డా. రాజేంద్రప్రసాద్, కార్తీక్‌రాజు, ‘వెన్నెల’ కిషోర్‌ ముఖ్యపాత్రల్లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌’. నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, భీమనేని శ్రీనివాసరావు కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న మరో గొప్ప సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’.

ఎటువంటి సినిమానైనా ఎదుర్కోగలుగుతుందని 200 శాతం విశ్వాసంతో, నమ్మకంతో విడుదల చేస్తున్నాం. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ ద్వారా మరో మంచి సినిమాను సమర్పిస్తున్నాను. తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘మా సినిమా పాటలకు, ట్రైలర్స్‌కి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. సెన్సార్‌ నుంచి ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది’’ అన్నారు భీమనేని శ్రీనివాసరావు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎ.సునీల్‌కుమార్, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు.

మరిన్ని వార్తలు