స్పెషల్ సాంగ్‌లో మహేష్ హీరోయిన్‌

2 Feb, 2019 15:59 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వన్‌ నేనొక్కడినే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ క్రితీ సనన్‌. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ భామ తరువాత బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. హీరోపంతి సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయి క్రితి తరువాత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ఈ భామ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడిందని తెలుస్తోంది.

కరణ్‌ జోహర్‌ నిర్మాణంలో వరుణ్ ధావన్, ఆదిత్య చోప్రా హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా కలాంక్‌లో క్రితి స్పెషల్ సాంగ్‌ లో నటించింది. ఇప్పటికే ఈ పాటకు సంబందించిన షూటింగ్ కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. క్రితి హీరోయిన్‌గా నటించిన లుకా చప్పీ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతుండగా అర్జున్‌ పఠియాలా, హౌస్‌ఫుల్‌ 4, పానిపట్‌ సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు