కూతురుపై దాడి తల్లికి బిజినెస్!

4 Nov, 2016 11:20 IST|Sakshi
కూతురుపై దాడి తల్లికి బిజినెస్!

లాస్ ఏంజిల్స్: కూతురిపై కొందరు దుండగులు దాడి చేశారు. కాళ్లు చేతులు కట్టేసి అందిన కాడికి దోచుకున్నారు. కూతురిపై జరిగిన ఈ దోపిడీ ఘటనను క్యాష్ చేసుకోవాలనుకుంటోంది రియాలిటీ టీవీ స్టార్ క్రిస్ జెన్నర్.

క్రిస్ జెన్నర్ కూతురు, ప్రముఖ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌పై అక్టోబర్ 3న కొందరు దుండగులు పారిస్‌ హోటల్‌లో దోపిడీకి పాల్పడ్డారు. ఆమెను బాత్‌రూంలో బంధించి నగలు, నగదు దోచుకొని వెళ్లారు. ఈ ఘటనతో తాను తీవ్ర భయభ్రాతులకు గురయ్యానని, రేప్ చేస్తారేమో అని భయమేసిందని కిమ్ వెల్లడించింది. కిమ్‌పై జరిగిన దాడికి ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారం లభించడంతో పాటు.. మంచి క్రైమ్ థ్రిల్లర్ అంశాలు ఇందులో ఉండటంతో.. దీనిని సినిమాగా తీస్తే మంచి లాభాలోస్తాయని క్రిస్ బిజినెస్ మైండ్ అంచనావేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా క్రిస్ ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టింది. కిమ్ పాత్ర కోసం మిలా కునిస్ లేదా నటాలియా పోర్ట్‌మెన్ అయితే బాగుంటుందని క్రిస్ ఆలోచిస్తోందట.