కృష్ణవంశీ, మరో ప్రయత్నం మొదలుపెట్టాడు

16 Apr, 2016 14:24 IST|Sakshi
కృష్ణవంశీ, మరో ప్రయత్నం మొదలుపెట్టాడు
ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న కృష్ణవంశీ పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగోలేదు. ముఖ్యంగా మొగుడు, పైసా సినిమాaతో కృష్ణవంశీ క్రియేటివిటీ మీదే అనుమానాలు మొదలయ్యాయి. అయితే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే మంచి వసూళ్లను రాబట్టడంతో కాస్త పరవాలేదనిపించాడు. కానీ అవకాశాల కోసం మాత్రం చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది.
 
ఫైనల్గా రుద్రాక్ష పేరుతో ఓ ఫాంటసీ సినిమాను ప్లాన్ చేశాడు కృష్ణవంశీ, అయితే ఈ సినిమా చర్చల దశలో ఉండగానే బాలయ్య వందో సినిమా కోసం పిలుపు రావటంతో రుద్రాక్షను పక్కన పెట్టాశాడు. కానీ బాలయ్య సినిమా కూడా ఫైనల్ కాకపోవటంతో రెండు సినిమాలు ఆగిపోయాయి. దీంతో ఆలోచనలో పడ్డ కృష్ణవంశీ ప్రస్తుతం ఓ కుర్ర హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడట.
 
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు కృష్ణవంశీ. సందీప్ కిషన్ కూడా కెరీర్ లో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరు కలిసి ఓ భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నారట. మరి ఈ సినిమానైనా కృష్ణవంశీ సెట్స్ మీదకు తీసుకువస్తాడేమో చూడాలి.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి