ప్రభాస్ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాడా?

19 Jan, 2016 17:53 IST|Sakshi
ప్రభాస్ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాడా?

హైదరాబాద్:  టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాడట. అదీ  ప్రేమ పెళ్లి. అవును  ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్  కృష్ణంరాజు   ప్రకటించారు. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటానని సంక్రాంతి పండగ సందర్భంగా ప్రభాస్ తనకు ప్రామిస్ చేసాడన్నారు.  ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా అవ్వొచ్చు అని    కృష్ణంరాజు నర్మగర్భంగా ప్రకటించిడం ఆసక్తిని రేపింది.  దీంతో డార్లింగ్  మనసు గెలుచుకున్న అమ్మాయి ఎవరబ్బా అని  టాలీవుడ్  ఆరా తీస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ కు సరిజోడు అయ్యే అమ్మాయిని ఫైనలైజ్ చేయడంలో మా ఫ్యామిలీ అంతా బిజీగా  ఉంది కృష్టంరాజు తెలిపారు. ఈ సంవత్సరం ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగొచ్చని  అమ్మాయిని ఫైనల్ చేయడమే ఆలస్యం' అని చెప్పుకొచ్చారు. మరోవైపు గతంలో  ప్రభాస్ పెళ్లిపై వార్తలపై  ఆగ్రహం వ్యక్తం చేసిన  కృష్ణంరాజు కూల్ గా ఈ విషయాన్ని ప్రకటించడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది

ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్టు వివరాలను  వివరించిన కృష్ణంరాజు బాహుబలి-2' షూటింగ్ తర్వాత ప్రభాస్ తన సొంత బేనర్ గోపి కృష్ణ మూవీస్ తో సినిమా చేస్తున్నాడని ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్టెనర్ గా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. బాహుబలి 2 తర్వాత ఈ చిత్రం సెట్స్ మీదకు వెళుతుంది అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ జేమ్స్ బాండ్ పాత్రకు దగ్గరగా ఉంటుంది. ప్రభాస్ అభిమానులకు నచ్చే అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తాము అన్నారు కృష్ణం రాజు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా