సూపర్‌మార్కెట్‌లో థ్రిల్‌

21 Oct, 2019 01:41 IST|Sakshi
శ్రీనాద్‌ పులకరం, గౌతం రాజు, కృష్ణ

హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’. శ్రీనాధ్‌ పులకరం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎల్సాగోష్‌ కథానాయికగా నటించారు. బీజీఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ స్టూడియోస్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో గౌతంరాజు మాట్లాడుతూ– ‘‘యూత్‌ ఫుల్‌ లవ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. క్లైమాక్స్‌ వరకూ సస్పెన్స్‌ అలానే ఉండి ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది. మా అబ్బాయి కృష్ణ ముందు నుంచి చిరంజీవిగారి అభిమాని. ఈ చిత్రంలో డ్యాన్సులు, ఫైట్స్‌ బాగా చేశాడు.

నేను ఇండస్ట్రీకి వచ్చిన 33 ఏళ్ల నుంచి చాలా మందికి సాయం చేస్తూ వచ్చాను. మా సినిమాకి ఇంకా మంచి హైప్‌ వచ్చేలా మీడియా చేస్తే.. దానివల్ల మరికొంత మందికి సహాయం చేసే అవకాశం వస్తుంది’’ అన్నారు.  ‘‘మా సినిమా పాజిటివ్‌ వైబ్స్‌తో వెళుతోంది. స్టోరీ, స్క్రీన్‌ ప్లే బాగా చేసిన మా డైరెక్టర్‌కి థ్యాంక్స్‌. యంగ్‌ టీమ్‌ చాలా కష్టపడి సినిమా చేశాం’’ అన్నారు కృష్ణ. ‘‘మా చిత్రం బాగుందని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే పూర్తిస్థాయిలో ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడంలో అంతగా సక్సెస్‌ కాలేదనిపిస్తోంది’’ అని శ్రీనాధ్‌ పులకరం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బోలే షవాలీ, కెమెరా: ఎ. విజయ్‌కుమార్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు