ఉప్పెనతో ఎంట్రీ

19 May, 2019 05:33 IST|Sakshi
కృతీ శెట్టి

తెలుగు వెండితెరపై విజృంభించిన కన్నడ తారల్లో అనుష్క ముందు వరుసలో ఉంటారు. అనుష్క అంత కాకపోయినా మరో కన్నడ భామ ప్రణీత కూడా ఇక్కడ కొంచెం పేరు సంపాదించుకున్నారు. అనుష్క బొమ్మాళీగా ఫేమస్‌ అయితే ‘అమ్మో బాపుగారి బొమ్మో’ పాట తర్వాత ప్రణీత బాపూ బొమ్మగా ఫేమస్‌ అయ్యారు. ఓ పదేళ్ల క్రితం రక్షిత, ఆ తర్వాత సంజన, ఆ తర్వాత హరిప్రియ.. ఇలా శాండిల్‌వుడ్‌ నుంచి టాలీవుడ్‌కి కన్నడ భామలు వస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌ సెన్సేషన్‌ రష్మికా మండన్నా ఉండనే న్నారు. ఇప్పుడు మరో కన్నడ భామ కృతీ శెట్టి తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఉప్పెన’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌ సరసన మంగళూరు బ్యూటీ కృతీ శెట్టి కథానాయికగా నటించనున్నారు. సుకుమార్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మే 25న  ప్రారంభం కానుంది. కోలీవుడ్‌ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సైన్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శ్యామ్‌ దత్‌ సైనుద్దీన్, సీఈవో: చెర్రీ, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ (సీవీఎం).

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌