లండన్‌లో ఫన్‌

15 Jul, 2018 01:51 IST|Sakshi
కృతీ సనన్, పూజా హెగ్డే, ఫర్హా ఖాన్, కృతీ కర్భందా

ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు కృతీ సనన్, పూజా హెగ్డే,  కృతీ కర్భందా లండన్‌లో కలిశారు. హాలీడే సందర్భంగా కలవలేదు. అనుకోకుండా కలవలేదు. థియేటర్స్‌ను ఆడియన్స్‌తో హౌస్‌ఫుల్‌ చేసేందుకు ‘హౌస్‌ఫుల్‌ 4’ కోసం కలిశారు. హౌస్‌ఫుల్‌ ఫ్రాంచైజీలో వస్తోన్న ఫోర్త్‌ ఫార్ట్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’. ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ పార్ట్స్‌కు దర్శకత్వం వహించిన సాజిద్‌ ఖాన్‌నే ‘హౌస్‌ఫుల్‌ 4’ను తెరకెక్కిస్తున్నారు.

థర్డ్‌ పార్ట్‌కు సాజిద్‌– ఫర్హాద్‌ ద్వయం దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అక్షయ్‌కుమార్, బాబీ డియోల్, రితేష్‌ దేశ్‌ముఖ్, పూజా హెగ్డే, కృతీసనన్, కృతీ కర్భందా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్‌ జరుగుతోంది. తొలుత సాంగ్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఫర్హా ఖాన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ బార్బర్‌ పాత్రలో కనిపించనున్నారు. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

అందుకు ఇది సమయం కాదు: రహమాన్‌

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

సినిమా

‘చౌరస్తా’నుంచి మరో సాంగ్‌.. బాహుబలినై

వారి పెళ్లి పెటాకులేనా?!

రానాతో కలిసి బాలకృష్ణ మల్టీస్టారర్‌ మూవీ!

కరోనా: ట్రెండింగ్‌లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?