ఆక్షన్‌ హీరో

8 May, 2018 00:22 IST|Sakshi
హృతిక్‌ రోషన్‌

స్పైడర్‌ మ్యాన్, సూపర్‌ మ్యాన్, ఐరన్‌ మ్యాన్‌.. వీళ్లంతా సూపర్‌ హీరోలు. కానీ హాలీవుడ్‌ సూపర్‌ హీరోలు.  మన ఇండియన్‌ సూపర్‌ హీరో అంటే మనకు గుర్తొచ్చేది ‘క్రిష్‌’. హృతిక్‌ రోషన్‌ బ్లాక్‌ జాకెట్, బ్లాక్‌ మాస్క్‌ వేసుకొని చేసిన సాహసాలు, యాక్షన్‌ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంజాయ్‌ చేశారు. సూపర్‌ హీరో ‘క్రిష్‌’ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు.  ‘క్రిష్‌’ సిరీస్‌లో మూడు సినిమాలు కూడా రిలీజ్‌ అయ్యాయి.

నాలుగో సినిమా కూడా త్వరలో రానుంది. ఇప్పుడీ యాక్షన్‌ హీరోను.. ఆక్షన్‌ హీరో చేశారు. ‘క్రిష్‌’ సినిమాలో హృతిక్‌ ధరించిన బ్లాక్‌ జాకెట్‌ను ఇప్పుడు ఆక్షన్‌ (వేలానికి) పెట్టారు. అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా ‘సాల్ట్‌ స్కౌట్‌’ అనే సంస్థ ద్వారా సెలబ్రిటీలు సినిమాల్లో వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను వేలం వేసి వచ్చిన డబ్బును చారిటీకి ఉపయోగించనున్నారు. అందులో భాగంగా  ‘క్రిష్‌’ సినిమాలో హృతిక్‌ ధరించిన బ్లాక్‌ కోట్‌ను వేలంలో ఉంచారు.

మరిన్ని వార్తలు