ఇద్దరు స్నేహితుల కథ...

7 Jul, 2019 02:13 IST|Sakshi
కె.వెంకట్‌ రామిరెడ్డి

‘కె.ఎస్‌ 100’ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. చంద్రశేఖరా మూవీస్‌ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి షేర్‌ దర్శకుడు. కె.వెంకట్‌ రామిరెడ్డి నిర్మాత. శనివారం విలేఖరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ–‘మాది ఇంపోర్ట్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ బిజినెస్‌. 1995 నుండి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇంగ్లిష్‌ సినిమాలను తెలుగులోకి డబ్బింగ్‌ చేసేవాడిని. ఇప్పటివరకు దాదాపు 25 సినిమాలు చేశాను.

‘టైమ్‌పాస్‌’ ‘మోడ్రన్‌ గర్ల్‌’ చిత్రాల ద్వారా నిర్మాతగా మారాను. ‘కె.ఎస్‌ 100’ నిర్మాతగా నా మూడవ చిత్రం. ఈ చిత్రంలోని కె అంటే కుమార్, ఎస్‌ అంటే స్వామి. ఈ ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. కొన్ని సంఘటనల వల్ల వారు శత్రువులుగా మారుతారు. ఆ స్నేహితులు మళ్లీ కలిశారా? లేదా? అనేది కథ. షేర్‌  అద్భుతంగా తెరకెక్కించారు. ట్రైలర్స్‌ బాగుండడంతో తమిళ డబ్బింగ్‌ రైట్స్‌ మంచి రేటుకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా బిజినెస్‌ పరంగా సేఫ్‌లో ఉన్నాను’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు