సెట్లో ఆయన హెడ్‌ మాస్టర్‌

7 Dec, 2019 03:03 IST|Sakshi

‘‘మేనమామ, మేనల్లుడి కథతో తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. ఈ సినిమాలో వినోదం, యాక్షన్, మాస్‌ అంశాలతో పాటు భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూసిన ప్రేక్షకులకు వారి మేనమామ, మేనల్లుళ్లు, మేనకోడళ్లు గుర్తుకు వస్తారు’’ అన్నారు కేఎస్‌ రవీంద్ర (బాబీ). వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’.  సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. వివేక్‌ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల  కానుంది. ఈ సందర్భంగా బాబీ చెప్పిన విశేషాలు.

సురేష్‌బాబుగారు హెడ్మాస్టర్‌లాంటి వారు.. చాలా సందేహాలు వస్తుంటాయి.. ఇది కరెక్టా? కాదా? అని ఆలోచిస్తారు. బహుశా ఆ లక్షణం ఆయన చదువు, అనుభవం వల్లే ఉండొచ్చు. ఆయన టార్చర్‌ స్మూత్‌గా ఉంటుంది. కానీ ఒత్తిడి చేయరు.   

వెంకటేశ్‌గారి సినిమాల్లో ‘లక్ష్మీ‘ సినిమా చాలా ఇష్టం. అందులో ఆయన పాత్ర మాస్‌ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మిలటరీలో ఉండే నాగచైతన్య గ్రామంలో ఉన్న మావయ్య వద్దకు వస్తాడు. వారి మధ్య వచ్చే భావోద్వేగాల సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయి. వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్‌లో సినిమా చెయ్యాలన్నది రామానాయుడుగారి కల అని సురేష్‌బాబుగారు చెప్పడంతో మరింత బాధ్యతతో ఈ సినిమా చేశా.  

‘వెంకీ మామ’ ప్రివ్యూ చూసిన తమన్‌ ఏడ్చేశాడు. ఇది వీర లెవల్‌ సినిమా అని సురేష్‌బాబుగారికి చెప్పాడు. తనొక్కడే కాదు.. డిస్ట్రిబ్యూటర్లతో పాటు మరికొందరు ఈ టైమ్‌కి ‘వెంకీ మామ’ కరెక్ట్‌ సినిమా అన్నారు.  వ్యక్తిగతంగా నాకు కమర్షియల్‌ సినిమాలంటేనే ఇష్టం. ‘బాబీ భావోద్వేగాలను కూడా బాగా చూపించగలడు’ అని ప్రేక్షకులు నమ్మాలి. అది ‘వెంకీ మామ’తో కుదిరింది. 

మరిన్ని వార్తలు