సామజవరగమన పాటకు కేటీఆర్‌ ఫిదా

21 Jan, 2020 13:07 IST|Sakshi

సామజవరగమన.. ఈ పాట కొన్ని కోట్ల మందిని ఆగం చేసింది. రింగ్‌ టోన్‌, కాలర్‌ ట్యూన్‌ ఇలా ఎక్కడ చూసినా ఇదే పాట. ప్రతి ఒక్కరికీ మత్తులా ఎక్కేసిన ఈ పాటకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఫిదా అయ్యారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన తనను మైమరపింపజేసిన సామజవరగమన.. పాటను ప్రశంసిస్తూ మంగళవారం ఉదయం ట్వీట్‌ చేశారు. ‘విమానం కాస్త ఆలస్యమైంది. అప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉదయం 3.30 అవుతోంది. ఆ సమయంలో సామజవరగమన పాట విన్నాను. నాకు మంచి కంపెనీ ఇచ్చిందీ సాంగ్‌. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పాట వెంటనే నా ప్లేలిస్ట్‌లో చేరిపోయింది. థమన్‌.. ఈ సాంగ్‌తో మిమ్మల్ని మీరే  మించిపోయారు’ అని పేర్కొన్నారు.

దీనికి సంగీత దర్శకుడు ఎస్‌.థమన్‌ స్పందిస్తూ మీ నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందంటూ కేటీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. మీ వల్ల సామజవరగమన పాట మరింత సెన్సేషనల్‌ అవుతుందని ట్వీట్‌ చేశాడు. కాగా అల వైకుంఠపురం సినిమాలోని ప్రతి పాట ప్రేక్షకుల చేత సూపర్‌ హిట్‌ అనిపించుకున్న విషయం తెలిసిందే. ఇక జనవరి 12న విడుదలై సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం గత చిత్రాల రికార్డులను తుడిచిపెట్టుకుపోతూ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.



 

చదవండి:

సైరా రికార్డును తుడిచేసిన అల

వైజాగ్‌లో సినీ పరిశ్రమ నెలకొల్పాలి

కష్టాన్నంతా మరచిపోయాం – తమన్‌

మరిన్ని వార్తలు