టైటిల్‌ చూడగానే కంగారుపడ్డాను

26 Jun, 2018 00:38 IST|Sakshi
అనీషా అంబ్రోస్, వెంకటేశ్‌ కాకుమాను, విశ్వక్‌సేన్, అభినవ్‌ గోమటం, వివేక్‌ సాగర్, తరుణ్‌ భాస్కర్, కెటీఆర్, రానా దగ్గుబాటి, సురేశ్‌ బాబు

కేటీఆర్‌

‘‘అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ మినిస్టర్‌గా ఈ టైటిల్‌ చూడగానే కంగారుపడ్డాను. హైదరాబాద్‌ రోడ్ల గురించి పేపర్‌లో రాస్తుంటారు ‘ఈ నగరానికి ఏమైంది’ అని. దానితో ఈ సినిమాకి ఏం సంబంధం లేదనుకుంటాను (నవ్వుతూ)’’ అన్నారు తెలంగాణ సమాచార సాంకేతిక, మున్సిపల్‌ అండ్‌ అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ మినిస్టర్‌ కేటీఆర్‌. ‘పెళ్ళి చూపులు’ ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. విశ్వక్‌ సేన్, సాయి సుశాంత్, వెంకట్‌ కాకుమాను, అభినవ్‌ గోమటం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్‌ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. డి. సురేశ్‌ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం వివేక్‌ సాగర్‌. ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది.

ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ– ‘‘తరుణ్‌ భాస్కర్‌ నన్ను ఆహ్వానించినప్పుడు ఒక్కటే అడిగాను. మీ టీమ్‌ అంతా హ్యాండ్‌ల్యూమ్‌ వేసుకుంటానంటేనే వస్తాను అని. అన్నట్టుగానే అందరూ వేసుకున్నారు. ‘పెళ్ళి చూపులు’ సినిమాను బాగా ఎంజాయ్‌ చేశాను. తరుణ్‌ ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. సురేశ్‌బాబు ‘పెళ్ళి చూపులు’ చూడమని చెప్పారు. జనరల్‌గా ఫస్ట్‌ సినిమా హిట్‌ అయితే నెక్ట్స్‌ సినిమా పెద్ద పెద్ద స్టార్స్‌తో హంగామాగా ఉంటుంది. కానీ మళ్లీ కొత్తవాళ్ళతో సినిమా చేస్తున్నా అనేసరికి నాకేం అర్థం కాలేదు. కామెడీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘హ్యాంగోవర్, దిల్‌ చాహ్‌తా హై’ లాంటి కూల్‌ సినిమాలాగా ఈ సినిమా ఉంటుందనుకున్నాను.

ఇంకా బెటర్‌గా ఉంటుందనుకుంటున్నాను. తెలుగు సినిమాల్లో ఛేంజ్‌ కనిపిస్తోంది. సందీప్‌ రెడ్డి, సంకల్ప్‌ రెడ్డి  ఇలా చాలామంది చేతుల్లో ఒక జాయ్‌ఫుల్‌ రైడ్‌గా తెలుగు ఇండస్ట్రీ ఉంటుందనుకుంటున్నాను. ఈ దర్శకులంతా హద్దుల్ని చెరిపేస్తున్నారు. ఈ సినిమా ‘పెళ్ళి చూపులు’ కంటే పెద్ద సక్సెస్‌ కావాలి. తరుణ్‌... నీకంటూ ఓ పాత్‌ క్రియేట్‌ చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. రానా మాట్లాడుతూ – ‘‘తరుణ్‌ అంటే ఎందుకో నాకు ఇష్టం. నేను చదివిన స్కూల్‌లోనే చదివాడు. నా జూనియర్‌. హెచ్‌పీయస్‌ (హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌) నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఒక గర్వం ఉంటుంది. ఆ గర్వం అతనిలోనూ ఉంది. ఫస్ట్‌ హిట్‌ కొట్టగానే స్టార్స్‌తో డీల్‌ మేకింగ్‌ చేసి కరెప్ట్‌ అయ్యే ఇండస్ట్రీ ఇది. అలా లొంగిపోకుండా మళ్లీ ఓ కథను చెప్పడానికి సిద్ధమైనందుకు చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఉంది. మా కంపెనీలో భాగమైనందుకు ఇంకా హ్యాపీ’’ అన్నారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ – ‘‘పెళ్ళిచూపులు’ సినిమా చూసి తరుణ్‌ నువ్వు మారొద్దు అని చెప్పాను. ఈ ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతోంది. తరుణ్‌ వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్‌. ‘సమ్మోహనం’ సినిమాలో కూడా అందుకే చిన్న గెస్ట్‌ అపియరెన్స్‌ చేయించాను. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్‌ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ – ‘‘కొత్త సినిమాలు ఎందుకు చేయాలి? కొత్తవాళ్లను ఎందుకు తీసుకు రావాలంటే.. ఎక్కడో దాక్కుండిపోయిన జెమ్స్‌ను బయటకు తీసుకురావచ్చు. అలాంటి వాళ్లను బయటకు తీసుకురావడం హానర్‌గా ఉంది. ప్రొడ్యూసర్‌ సురేశ్‌బాబుగారికి థ్యాంక్స్‌ చెప్పాలి. ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ మేకర్స్‌కి ఆయన ఫాదర్‌ ఫిగర్‌లాగా. మా కంటే మోడ్రన్, ముందు చూపు ఉన్న నిర్మాత. ఎటువంటి ఈగో లేని మనిషి.

‘పెళ్ళి చూపులు’ అప్పుడు, ఆ తర్వాత కూడా చాలా హెల్ప్‌ చేశారు. నికేత్‌ లాంటి గ్రేట్‌ టాలెంట్‌ పరిచయం అయ్యాడు. విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి. లత గురించి చెప్పకపోతే నాకు రాత్రి అన్నం ఉండదు. చాలా బాగా వర్క్‌ చేసింది. వివేక్‌ సాగర్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు’’ అన్నారు.‘‘ఆడిషన్స్‌లో సెలెక్ట్‌ అవ్వడం హ్యాపీ. సినిమాని చాలా ఎంజాయ్‌ చేస్తూ  చేశాం’’ అన్నారు అభినవ్‌ గోమటం. ‘‘ఫ్యామిలీ ఆడియన్స్‌ అందరూ కచ్చితంగా ఈ సినిమాను ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు సాయి సుశాంత్‌. ‘‘వెళ్లిపోమాకే’ సినిమా చూడమని చాలా మందికి షేర్‌ చేశా. కానీ ఈ సినిమాకి అలా అవసరం లేదు. అందరూ కచ్చితంగా వస్తారు. ఈ సినిమాను రిపీటెడ్‌గా చూస్తారు’’ అన్నారు విశ్వక్‌ సేన్‌.     ‘‘డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి యాక్టింగ్‌కి రావడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. తరుణ్, లత, నికేత్‌ అందరితో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు వెంకటేశ్‌ కాకమాను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’