న్యాయం జరిగేవరకూ పోరాటమే!

7 Aug, 2016 00:49 IST|Sakshi
న్యాయం జరిగేవరకూ పోరాటమే!

‘‘బాలు మహేంద్ర దర్శకత్వంలో జయరామ్, సరిత జంటగా నటించిన తమిళ సినిమా ‘జూలీ గణపతి’ని తెలుగులో రీమేక్ చేయాలని డబ్బింగ్, రీమేక్ రైట్స్ కొన్నాను. మా కథను చోరీ చేసి ‘చారుశీల’ తీశారు’’ అని ప్రణతి క్రియేషన్స్ అధినేత కూనిరెడ్డి శ్రీనివాస్ ‘చారుశీల’ బృందంపై ఆరోపణలు చేశారు. ఆధారాలతో సహా ‘చారుశీల’ దర్శక-నిర్మాతలను సంప్రదించగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ -

‘‘స్టార్ ఆర్టిస్టులతో రీమేక్ చేయాలని డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయలేదు. ‘శూర్పణక’ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించా. మేలో ‘చారుశీల’ స్టిల్స్ చూడగా సందేహం కలిగింది. చిత్ర నిర్మాత సాగర్‌గారిని సంప్రదిస్తే, ఫస్ట్ కాపీ వచ్చాక చూద్దామన్నారు. ట్రైలర్ అయితే మక్కీకి మక్కీ కాపీ. వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించా. ఇంతలో ఈ  నెల 18న ‘చారుశీల’ విడుదల అని ప్రకటించారు. బయ్యర్లకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ప్రెస్‌మీట్ పెట్టాను. న్యాయం జరిగే వరకూ పోరాడతాను’’ అని చెప్పారు.

>