ఆ విషయంలో నన్ను ఎక్కిరించేవారు: ఖుషీ కపూర్‌

18 May, 2020 15:21 IST|Sakshi

ముంబై: శ్రీదేశి, బోనికపూర్‌ల ముద్దుల తనయ ఖుషి కపూర్‌ తాను బాధపడిన విషయాల గురించి, అభద్రతకు లోనైన సంఘటనలకు సంబంధించి ఒక భావోద్వేగమైన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. క్వారంటైన్‌ టేప్స్‌ పేరుతో తన వీడియోలను తన ఎకౌంట్‌లో ఖుషి పోస్ట్‌ చేస్తోంది. ఈ వీడియోలో ఖుషి తాను ఒక 19 యేళ్ల అమ్మాయిని అంటూ తనని తాను పరిచయం చేసుకుంది. తాను ఇప్పుడు కనిపిస్తున్నట్లు లేనని తాను పరిపక్వత చెందాను అని తెలిపింది. ఇంకా మాట్లాడుతూ... ‘నేను ఎలా ఉండాలనుకున్నానో అలా లేను, దాని కోసం నేను ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. నేను ఏం చేయకపోయిన చాలా మంది నన్ను పొగుడుతూ ఉంటారు. నేను వారిని సంతోషపరచడానికి ఏదో ఒకటి చేయగలను’ అని పేర్కొంది. 

( రియాక్షన్‌ మాకు ఆక్సిజన్‌)
ఆ తరువాత తనకి చాలా సిగ్గు, బిడియం ఎక్కువ అని ఆ కారణంగా తను చాలా సార్లు అవమానాలు ఎదుర్కొన్నానని పేర్కొంది. తనను అమ్మ(హీరోయిన్‌ శ్రీదేవి)లాగా , అక్క జాన్వీ కపూర్‌ లాగా లేవంటూ చాలా మంది ఎక్కిరించేవారని కూడా తెలిపింది. అది మానసికంగా తనని చాలా ఇబ్బందులకు గురిచేసిందని తెలిపింది. దీంతో  తినే పద్దతిని, డ్రెస్సింగ్‌ స్టైల్‌ని కూడా మార్చుకున్నట్లు తెలిపింది. ఇక వీడియో చివరిలో ఇటువంటి అన్నింటి కారణంగా తనని తాను ప్రేమించడం నేర్చుకున్నానని తెలిపింది. తాను ఎలా ఉన్నా, తన రంగు ఎలా ఉన్నప్పటికి తనని తాను ఇష్టపడటం అలవాటు చేసుకున్నట్లు చెప్పింది.  ఇతరుల గురించి పక్కన పెట్టి మీరు ఏం చేయాలనుకున్నారో అదే చేయండి. తరువాత మిమ్మల్ని అందరూ వాళ్లంతట వారే మెచ్చుకుంటారు అంటూ ఖుషి తన వీడియోని ముగించింది. (సహాయం కోసం వేలం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు