‘నో’ చెప్పలేని ఆఫర్‌

31 Jan, 2018 00:25 IST|Sakshi
నయనతార

నో చెప్పలేని ఆఫర్‌ వస్తే వెనకా ముందూ ఆలోచించకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు ఎవరైనా. నయనతార ముందు అలాంటి ఓ భారీ ఆఫర్‌ ఉందట. ఇంతకీ అంత పెద్ద అవకాశం ఏంటీ? అనే విషయానికొస్తే.. లోక నాయకుడు సరసన నటించే చాన్స్‌. లోక నాయకుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రని అయినా సునాయాసంగా చేసేసే కమల్‌హాసన్‌కి సినిమా లవర్స్‌ ఇచ్చిన బిరుదు అది. కమల్‌ సరసన ‘భారతీయుడు–2’లో నటించమని చిత్ర దర్శకుడు శంకర్‌ వర్గం నయనతారని సంప్రదించారని టాక్‌.

1996లో కమల్‌ హీరోగా శంకర్‌ తీసిన ‘భారతీయుడు’కి ఇది సీక్వెల్‌. ఇందులో కథానాయిక విప్లవ నాయిక అని సమాచారం. ఈ పాత్రకే నయనతారను అడుగుతున్నారట. కమల్‌తో జోడీ, శంకర్‌ లాంటి గొప్ప దర్శకుడు, సెన్సేషనల్‌ హిట్‌ మూవీ ‘భారతీయుడు’కి సీక్వెల్, దాదాపు 200 కోట్ల బడ్జెట్‌... ‘నో’ చెప్పలేని ఆఫర్‌ కదా. మరి.. నయనతారకు కూడా అలానే అనిపిస్తే ‘యస్‌’ చెప్పేయడం గ్యారంటీ. ఒకవేళ డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేకపోతే అప్పుడు నయనతార స్థానంలో శంకర్‌ బృందం వేరే తారను అనుకోవాలి. 

మరిన్ని వార్తలు