అలాంటి వాళ్లకు జవాబే ఈ సినిమా!

9 Feb, 2016 23:53 IST|Sakshi
అలాంటి వాళ్లకు జవాబే ఈ సినిమా!

 ‘‘పెళ్లికి ముందు అమ్మాయి తప్పు చేస్తే దానికి  బాధ్యత తండ్రిదే. పెళ్లయ్యాక చేస్తే ఆ తప్పు కట్టుకున్న భర్తదే. ఈ సినిమాలో మా కథానాయిక పాత్ర కూడా అంతే. మా ‘లజ్జ’ చిత్రం ఓ రకంగా కమర్షియల్ హిట్టే. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేసింది’’ అని దర్శకుడు నరసింహ నంది అన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లజ్జ’ గత శుక్రవారం విడుదలైంది. నరసింహ నంది మాట్లాడుతూ - ‘‘చలం రాసిన ‘మైదానం’ నవల స్ఫూర్తితో ఈ సినిమా తీశాను.
 
  ‘బాగా ఆలోచించే వాళ్ల కోసమే నేను సినిమా తీస్తాను. కొత్త కథలు రావడం లేదు’ అంటున్నారు. అలాంటి వాళ్లకు సమాధానమే ఈ సినిమా. నాలుగు ఫైట్లు, కామెడీ ఉండే రెగ్యులర్ సినిమా చేయడం నాకు ఇష్టం ఉండదు. ఈ సినిమా కంటెంట్ నచ్చి బాలీవుడ్ నుంచి ఆఫర్ కూడా వచ్చింది. కానీ ఇలాంటి సినిమాలు పదే పదే చేయలేం. ప్రస్తుతం చేస్తున్న ‘బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్’ చిత్రీకరణ పూర్తయింది’’ అని చెప్పారు.