మరో టాక్‌ షో

12 Sep, 2019 01:08 IST|Sakshi
మంచు లక్ష్మీ, రకుల్‌

బిగ్‌స్క్రీన్‌ ఎంట్రీ కంటే ముందే టెలివిజన్‌లో హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు లక్ష్మీ మంచు. ‘లక్ష్మీ టాక్‌ షో, ప్రేమతో మీ లక్ష్మీ, లక్‌ ఉంటే లక్ష్మీ...’ వంటి విభిన్న టెలివిజన్‌ షోలు చేశారు. మంచి హోస్ట్‌ అని ప్రేక్షకులు ఫుల్‌ మార్కులు వేశారు. తాజాగా ‘ఊట్‌’ సబ్‌స్క్రిప్షన్‌ వీడియో అన్‌ డిమాండ్‌ సర్వీస్‌ యాప్‌కు ఓ టాక్‌ షో చేస్తున్నారు లక్ష్మీ మంచు. ఈ ప్రోగ్రామ్‌లో తొలి గెస్ట్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాల్గొన్నారు. త్వరలోనే ‘ఊట్‌’ లో ఈ షో ప్రసారం కానుంది.

మరిన్ని వార్తలు