బికినీకి సై

2 Oct, 2016 03:06 IST|Sakshi
బికినీకి సై

 నటి లక్ష్మీమీనన్ మైండ్‌సెట్ మారిందా? తన సహ నటీమణులకంటే వెనుక పడ్డానని గ్రహించిందా? అవకాశాలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? తన తాజా మాటల్లో ఇలాంటి ప్రశ్నలు సాధారణ ప్రేక్షకుడికి కూడా తెలెత్తకపోవు. కొండవాసి యువతిగా కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళాకుట్టి ఆ చిత్ర విజయం తన జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత వరుస అవకాశాలు. వాటిలో తొంబై శాతం విజయాలు వరించడంతో తమిళచిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాంటి సమయంలో ఆపేసిన చదువును పూర్తి చేయాలంటూ నటనకు చిన్న విరామం తీసుకుంది. అది తనపై పెద్ద ప్రభావాన్నే చూపించిందనే చెప్పాలి.
 
  అజిత్‌కు చెల్లెలిగా వేదాళం చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. లక్ష్మీమీనన్‌కు మంచి పేరే వచ్చింది. అయినా అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్‌లో చిత్రాలను తగ్గించుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఈ మలయాళీ భామను అడిగితే అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. అయితే ఇకపై నటనపై అధిక శ్రద్ధ చూపాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రం ఏడో తేదీన తెరపైకి రానుందని, ఇందులో గ్లామరస్ పాత్రను పోషించానని తెలిపింది. అదే విధంగా విజయ్‌సేతుపతితో కలిసి నటించడం వినూత్న అనుభవంగా పేర్కొంది.
 
 తదుపరి జీవాకు జంటగా నెంజముండు నేర్మైయుండు చిత్రంలో నటించనున్నానని చెప్పింది. గ్లామర్‌కు సిద్ధం అయ్యానంటున్నారు ఈత దుస్తులు ధరించి నటిస్తారా? అన్న ప్రశ్నకు తాను స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఈత దుస్తులు ధరించి స్మిమ్ చేశానని, అలాంటిది సినిమాల్లో ఈత దుస్తుల్లో నటించడం ఒక లెక్కా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.తనకు ఇప్పటి వరకూ ఈత దుస్తుల్లో నటించే అవకాశం రాలేదని, అలాంటి సందర్భం వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అయితే నిజ జీవితంలో ఇప్పటి వరకూ బికినీ ధరింలేదని, అందువల్ల సినిమాల్లోనూ అలాంటి దుస్తులు ధరించనని తెలిపింది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు మోడరన్ దుస్తులు తన శరీరాకృతికి నప్పవు అని చెప్పుకొచ్చిన ఈ కేరళాకుట్టి ఇప్పుడు అలాంటి పాత్రలకు సిద్ధపడింది.రేపు బికినీ ధరించినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి