ఈమె కూతా ఘనమే

10 Jun, 2014 02:20 IST|Sakshi
ఈమె కూతా ఘనమే

ఇప్పుడు నటనకయినా, పాడటానికయి నా పెద్దగా కసరత్తు లేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పాడటానికి సం గీత సాధనతో కూడా పని లేకుండా పోయిం ది. కాస్త హస్కీ వాయిస్ ఉంటే చాలు పాడేయవచ్చు. గాయనీమణులైన నటీమణుల శాతం తక్కువే. హీరోల్లో అయితే రజనీ, కమల్, విజయ్, సూర్య, శింబు, ధను ష్, కార్తి, విశాల్, శివకార్తికేయన్, భరత్ అంటూ వరుసపెట్టి పాడేశారు. ఇలా తమిళంలో పాడిన హీరోయిన్లు ప్రస్తుతం లేరనే చెప్పాలి. ఆండ్రియా, మమతా మోహన్ దాస్, రమ్యా నంబీశన్ వంటి వారు గాయనీమణులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వీరందరూ ఇతర భాషలకు చెందిన వారేననన్నది గమనార్హం. వీరిలో రమ్యా నంబీశన్ కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు.
 
 ఈమె మలయాళంలో పలు పాటలు పాడినా తొలిసారిగా పాండియనాడులో గళం విప్పారు. ఆ తరువాత డమాల్ డుమీల్ చిత్రంలో ఒక పాట పాడారు. ఇప్పుడీ జాబితాలో లక్ష్మీ మీనన్ చేరారు. కుంకీ నుంచి ఇటీవల విడుదలైన మంజాపై చిత్రం వరకు వరుస విజయాలనే తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న ఈ లక్కీ హీరోయిన్ తాజాగా గాయని అవతారమెత్తారు. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక ఊరుల రెండు రాజా చిత్రం కోసం ఐటమ్ సాంగ్ పాడేశారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఈ పాటను లక్ష్మీ మీనన్‌తో పాడాల్సి రావడంపై దర్శకుడు కన్నన్ తెలుపుతూ ఈ పాటకు హస్నిగా ఉండే వాయిస్ అవసరం అయ్యిందన్నారు.
 
 ఎవరితో పాడించాలన్న ఆలోచిస్తుండ గా డి.ఇమాన్ లక్ష్మీ మీనన్ పేరును సూచించారని చెప్పా రు. వెంటనే ఆమెను చెన్నైకి రప్పించి పాడించామని తెలి పారు. ఎక్కువ టేకులు తీసుకోకుండా రెండు గంటల్లో లక్ష్మీ మీనన్ పాడేశారని చెప్పారు. చాలా కాలం పాడాలనే ఆశ మనసులో ఉందని అది ఒరు ఊరుల రెండు రాజా చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందని లక్ష్మీ మీనన్ పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు డి.ఇమాన్, దర్శకుడు కన్నన్‌లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. డి.ఇమాన్‌కు హీరోయిన్లతో పాడించడం ఆనవాయితీగా మారింది. ఇంతకు ముందు ఆయన ప్రియాంక చోప్రా, మీనా, శృతిహాసన్, రమ్యా నంబీశన్ వంటి హీరోయిన్లతో పాడించారు.
 

>