ప్రేమ ఎలా పుట్టింది?

4 Sep, 2018 02:16 IST|Sakshi
తులిక సింగ్‌,హర్షకుమార్

హర్షకుమార్, తులిక సింగ్‌ జంటగా దీపక్‌ బల్దేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లాస్ట్‌ సీన్‌’. మధునారాయణ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్‌ ఠాకూర్‌ సమర్పణలో గ్లిట్టర్‌ ఫిల్మ్‌ అకాడమీ, ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌లో రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌  ఊటీ, కెట్టి వాలీ, పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీపక్‌ బల్దేవ్‌ మాట్లాడుతూ– ‘‘సీటీ లైఫ్‌ వద్దని స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణం కోసం ఊటీలో సెటిల్‌ అవ్వాలనుకునే అబ్బాయి.. పల్లెటూరు కంటే సిటీ లైఫ్‌ బాగుంటుంది అని సిటీ అబ్బాయిని లవ్‌ చేసి అక్కడే సెటిల్‌ అవ్వాలనుకునే అమ్మాయి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ ప్రేమ నిలబడుతుందా? అన్నదే చిత్ర కథ. యూత్‌కి 100% నచ్చే ప్రేమ కథ.  తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. ఊటీ షెడ్యూల్‌తో 80% చిత్రీకరణ పూర్తవుతుంది. మిగిలిన 20% షూటింగ్‌ హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో జరుపుతాం. మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్, కెమెరా: జవహర్‌ రెడ్డి, సహ నిర్మాత: అజయ్‌ గౌతమ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కొల్లా జగన్‌.

మరిన్ని వార్తలు